ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఇటీవల చేపట్టిన స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సిడీపివో నియామకాల్లో సోషియాలజీ పేపర్లో 6 మార్కులకు గాను మరియు జనరల్ స్టడీస్ పేపర్లో దాదాపు 8 మార్కు;లకు గాను తప్పులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. దీని మీద ఒక అభ్యర్థి ట్రిబ్యునల్లో కేసు కూడా వేయడం జరిగింది. అయితే ఎపిపిఎస్సి ఇటీవల నిర్వహించిన డ్రగ్ ఇనిస్పెక్తర్ నియామకాల్లో 6 మార్కులకు తప్పులు గుర్తించి సెలక్షన్ లిస్టును సవరించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎపిపిఎస్సి సుప్రీమ్ కోర్టు గడప తొక్కినా ప్రయోజనం లేకపోయింది. అంతే కాదు సమాధానాలను గుర్తించడంలో ఎపిపిఎస్సి నిర్లక్ష్యాన్ని ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుబట్టింది. తప్పుడు సమాధానాలతో నోటిఫికేషన్ ఇలా ముగిస్తారంటూ నిలదీసింది. ప్రతీ మార్కు అభ్యర్థి జీవితానికి సంబందిన్చినదని వారికి న్యాయం జరగాల్సిన అవసరాన్ని ట్రిబ్యునల్ నొక్కి చెప్పింది. దీనితో కొత్తగా 6 అభ్యర్థులకు అవకాశం లబించింది. అంతే కాదు అప్పటికీ విదులు నిర్వహిస్తున్న వారికి ఉద్వాసన తప్పలేదు. ఇదే విదంగా సిడీపివో నియామకాల్లో కూడా 107 పోస్టుల్లో తప్పులను సవరిస్తే సెలక్టయిన అభ్యర్థులు విదుల్లోంచి తప్పుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది.
ఎపిపిఎస్సి నిర్లక్ష్యం మరోమారు అభ్యర్థులకు పరీక్ష పెట్టనుంది. ట్రిబ్యునల్ తీర్పు పట్ల సర్వత్రా ఉత్కంట నెలకొంది. వివాదాలకు కేంద్రంగా మారుతున్న ఎపిపిఎస్సి పరీక్షల నిర్వహణ పట్ల అభ్యర్థులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఎపిపిఎస్సి నిర్లక్ష్యం మరోమారు అభ్యర్థులకు పరీక్ష పెట్టనుంది. ట్రిబ్యునల్ తీర్పు పట్ల సర్వత్రా ఉత్కంట నెలకొంది. వివాదాలకు కేంద్రంగా మారుతున్న ఎపిపిఎస్సి పరీక్షల నిర్వహణ పట్ల అభ్యర్థులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.